కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

by Kalyani |
కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల జిల్లాలో NHM (నేషనల్ హెల్త్ మెషిన్ ) ప్రోగ్రాం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రోగ్రాం క్రింద బస్తీ దవఖానాలలో (3) ఖాళీ మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తులను పూర్తి చేసి మే నెల 3వ తేదీ సాయంత్రం 5గంటల వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం https://gadwal.telangana. gov.in వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించారు.



Next Story