- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యమ స్ఫూర్తితో అందరూ మళ్లీ కొట్లాడాల్సిందే.. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం
దిశ , తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయ మార్పు కోసం , ప్రజలు కోరుకున్న తెలంగాణ రావాలంటే అప్పటి ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకమై మళ్లీ కొట్లాడాలని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్టం ప్రజాపోరాటాలు, అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు . ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో కరుణాకర్ దేశాయ్ నిర్వహించిన "త్యాగం ఎవరిది- భోగం ఎవరిది " అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పని అయిపోయిందని, జారుడు బండ మీద జారుతున్నాడని త్వరలో బురద గుంటలో పడ బోతున్నాడని జోస్యం చెప్పారు . తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్స వాల్లో చెప్పిన అబద్ధాలపై ఎన్నికలు వచ్చే దాకా కొట్లాడాలని పిలుపునిచ్చా రు. ఈ తొమ్మిదేళ్లలో కేసీఆర్ పెద్దోళ్ళను మరింత పెద్దగా చేసిండని, పేదోళ్ల పొట్ట కొట్టాడని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సహజ వనరులను అన్నిటిని దోపిడీ చేస్తోందని ఆరోపించారు దేశంలోనే ఇంత దోపిడీ చేసిన పార్టీ లేదన్నారు. జీవో 111 రద్దే ఇందుకు ఒక ఉదాహరణ అని అన్నారు . ధరణిని అడ్డం పెట్టుకుని భూములు కొల్లగొట్టారన్నారని కాళేశ్వరం రీ ఇంజినీరింగ్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్న ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు.
స్మారక చిహ్నం పై అమరుల పేర్లు ఏవి : ఆకునూరి మురళి
అమరుల చి హ్నాలపై ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అమరుల పేర్లు వుంటాయని, తెలంగాణ లో కే సి ఆర్ పెట్టిన స్మారక చిహ్నం పై నే అమరుల పేర్లు ఎక్కడ లేవన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు . కె సి ఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చామని ..చెప్పుకోవడానికి కే సి ఆర్ ఈ పని చేశాడని విమర్శించారు. కె సి ఆర్ లాంటి దుర్మార్గున్ని ఆయన కుటుంబాన్ని ఓడించడానికి అందరూ నడుం బిగించాలని కోరారు .అయితే బీ జే పీ లాంటి పార్టీ అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం వుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడా ల్సిన అవసరం ఉందని ఇందుకోసం 33 జిల్లాల్లో తిరిగి కె సి ఆర్ చేస్తున్న మోసాలను ప్రచారం చేయాలనీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మరళి పిలుపునిచ్చారు.
ఉద్యమంలో కేటీఆర్, కవిత ఎక్కడున్నరో చెప్పాలి : సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి
ఉద్యమంలో కేటీఆర్, కవిత ఎక్కడున్నరో చెప్పాలన్నారు. అమెరికాలో కలలో ఉద్యమం చేసిండ్రేమో అని ఎద్దేవా చేశారు . మంత్రులు తలసాని పువ్వాడ అజయ్ ఎక్కడఉన్నారని ప్రశ్నించారు . పువ్వడ నాన్న తెలంగాణ ఇవ్వొద్దు అన్నడని . అలాంటోనికి ఇవాళ మంత్రి పదవి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం చేసినోల్ల పేర్లు ఎక్కడ వినిపిస్తున్న యని బెల్లీ లలితక్క, సుష్మ స్వరాజ్, జైపాల్ రెడ్డి...వీళ్ల పేర్లు ఎక్కడైనా చెబుతారా అని అయన ప్రశ్నించారు. .టీఆర్ఎస్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ జాగా ఇప్పిస్తే అయన ఎవరికీ యాదికే వస్తలేరన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1400 అమరులు చనిపోతే స్మృతి వనంలో అమరుల పేరు పెట్టకుండా కేసీఆర్ తన ఫొటో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం పార్టీ పెట్టేందుకు ముఖ్య లక్ష్యం "అధికారమే" అని జస్టిస్ నిరూప్ రెడ్డి స్పష్టం చేసారు . 1969 ఉద్య మంలో 400 మంది చనిపోయారని అన్నారు . మలి దశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్పారు. కేశవరావు జాదవ్ తనకు ఇచ్చిన పుస్తకం తోనే తాను తెలంగాణ చరిత్ర తెలుసుకున్నా నని తెలిపారు . . సెక్ర టేరియట్ లో 1200 మంది ఆత్మలు తిరుగు తాయని కేసీఆర్ ను హెచ్చరించారు.