- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాణిజ్య ప్రకటనల్లో సినిమా హీరోలు చేసే స్టంట్స్‌లా రాష్ట్ర బడ్జెట్: కోదండరామ్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాణిజ్య ప్రకటనల్లో సినిమా హీరోలు చేసే స్టంట్స్‌లా ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, వెనుక బడిన తరగతుల సంక్షేమం, నిరుద్యోగ భృతి వంటి వాటిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌పై సోమవారం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు అన్యాయంగా ఉందన్నారు. రైతులకు కావాల్సిన రుణ సహాయం, మార్కెటింగ్ విధానాలు, పంటనష్టానికి పరిహారం లాంటి సహాయం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇలాంటి వాటి కోసం బడ్జెట్ కేటాయించకపోవడంపై విమర్శించారు.
రైతుబంధు పేరుతో చేస్తున్న సహాయం వల్ల పూర్తి రైతాంగానికి ప్రయోజనం చేకూరడం లేదని ఈ పథకం వల్ల కౌలు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. కౌరు రైతులను ఈ బడ్జెట్ లో విస్మరించారని ఆరోపించారు. రాష్ట్రంలో సాగుకు పనికి రాదని శాస్త్రవేత్తలు చెబుతున్న ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. చిరుధాన్యాల పరిరక్షణ, విస్తరణకు గాని ఇతర ప్రత్యామ్నాయ పంటల కోసం కానీ కేటాయింపుల్లో పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించలేదని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా కుప్ప కూలి పోయిందన్నారు. బడ్జెట్‌లో రోడ్లు మరియు బిల్డింగ్‌లు, ఇరిగేషన్‌కు రంగాలకు భారీగా చేశారని అయితే ఈ రెండు రంగాల్లో కేటాయింపులు కాంట్రాక్టుల లబ్ది కోసమేనని ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్న కోదండరామ్.. విద్య, మౌలిక సదుపాయాల కోసం చేసిన నిధుల కేటాయింపు ఏ మాత్రం సరిపోవని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పథకాలకు భారీగా నిధులు ప్రకటిస్తున్న ప్రభుత్వం అమల్లో మాత్రం ముందుకు వెళ్లలేకపోతోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లో 40 నుండి 50 శాతం కోత విధించారని కాగ్ ఆరోపించిందన్నారు. కేటాయించిన బడ్జెట్ నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పలేదని బడ్జెట్ లో కేటాయించిన వాటిలో 50 నుండి 60 శాతం కోత పెడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని ప్రభుత్వం అబద్దాలు చెబుతోంది నాతో వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిజస్వరూపం నిరూపిస్తానన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం చెబుతున్న మాట అబద్ధం అని హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఏ జిల్లాలో తలసరి ఆదాయం పెరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. కలలు కన్నా తెలంగాణ అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా ఏమీ లేవని విమర్శించారు.
Read More..