మంత్రి KTRకు ప్రొఫెసర్ కోదండరాం సంచలన సవాల్

by Rajesh |   ( Updated:2023-10-17 08:05:13.0  )
మంత్రి KTRకు ప్రొఫెసర్ కోదండరాం సంచలన సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగం, ఉపాధి అనేది యువత చేతుల్లో లేదని, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే.. యువత ఉద్యోగాలు సంపాదిస్తారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇవాళ ఆయన సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కష్టపడ్డదని, ఆమె కష్టానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆమె రాసుకున్న నోట్స్ ఉన్నాయని, ఆమె హైదరాబాద్‌లో ఉండి.. ఉద్యోగం సాధించిన తర్వతానే ఇంటికి వస్తానని ఒక ప్రతిజ్ఞ తీసుకున్నదన్నారు.

ఆమె జీవితం గురించి తల్లిదండ్రుల చెబుతున్న సాక్ష్యాలు కళ్ల ముందు ఉన్నాయన్నారు. ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిందని, కానీ ఉద్యోగం కల్పించాల్సిన ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. మరోవైపు మీరు కేసులు వేస్తేనే ఎగ్జామ్స్ రద్దయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారని గుర్తుచేశారు. పరీక్షలు సక్కగా నిర్వహించకపోతే కేసులు వేయకపోతే ఏం చేస్తారని సమాధానం చెప్పారు. ఇటీవల కేటీఆర్ ప్రకటించిన గణాంకాలన్ని తప్పుడు లెక్కలు అని విమర్శించారు. 2 లక్షలపైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, ఒక లక్ష కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రొఫెసర్ కోదండరామ్ సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed