విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-10 15:18:39.0  )
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ : సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని మొదటినుంచి ఫైర్ అవుతున్న సీఎం కేసీఆర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు మూలధనం/ ముడి సరుకుల కోసం నిధులు ఇచ్చి.. నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రతిపాదనల బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది.

ఇందులో సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటి పారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరి వెల్లడించడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖ పట్నం వెళ్లి స్టడీ చేయాలని ఉన్నతాధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఒకటి, రెండు రోజుల్లో ఆఫీసర్ల టీం ఏపీకి వెళ్లనున్నట్లు తెలిసింది.

అయితే ఇటీవల బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ స్టీల్ ప్టాంట్ కర్మాగారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కలవగా.. ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న పరిష్కార మార్గాలను వారు ఆయనకు సూచించారు. వాటిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా ప్రగతిభవన్ లో ఈ అంశంపై సీఎం డిస్కస్ చేశారు. అనంతరం రాష్ట్ర సర్కార్ తరపున బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు.

Also Read..

200 ఏళ్ల క్రితమే జ్యోతిరావు ఫూలే ఆ పనిచేశారు: సీఎం కేసీఆర్

Advertisement

Next Story

Most Viewed