2000 నోట్లతో బ్లాక్ మనీ బాగా పోగయ్యింది.. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడారి నాగారాజు

by Javid Pasha |   ( Updated:2023-05-22 17:18:45.0  )
2000 నోట్లతో బ్లాక్ మనీ బాగా పోగయ్యింది.. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడారి నాగారాజు
X

దిశ, వెబ్ డెస్క్: 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ మే 19న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వినియోగదారులకు నోట్లు మార్పిడి చేసుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఇక దేశంలోని పలు బ్యాంకుల్లో ఈ నెల 23 నుంచి నోట్ల మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఆర్బీఐ తీసుకున్న 2000 నోట్ల రద్దుపై పలు వర్గాల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు తన అభిప్రాయాలను దిశ టీవీతో పంచుకున్నారు. 2000 నోట్లు వల్ల బ్లాక్ మనీ విపరీతంగా పోగయ్యిందని అన్నారు. ఆర్బీఐ ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో తెలియాలంటే కింది వీడియోను మొత్తం చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed