వర్క్ ఫ్రం హోం చేయండి.. అనవసరంగా బయటకు రావద్దు

by GSrikanth |   ( Updated:2023-09-06 14:21:57.0  )
వర్క్ ఫ్రం హోం చేయండి.. అనవసరంగా బయటకు రావద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పోలీస్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు. ఐటీ సహా అవకాశం ఉన్న ఇతర ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు. అత్యవసర ఉద్యోగులు ఆఫీస్ నుంచి ఇంటికి వర్షాభావ పరిస్థితులను బట్టి బయలుదేరాలని తెలంగాణ స్టేట్ పోలీస్ సూచించారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షానికి రహదారులపై భారీగా వర్షం నీరు చేరింది. ఫలితంగా మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. కారణంగా రాకపోకలు స్తంభించాయి.

Advertisement

Next Story