Pocharam: సీఎం నిర్ణయానికి స్వాగతిస్తున్నాం.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

by Ramesh Goud |   ( Updated:2024-12-09 06:49:03.0  )
Pocharam: సీఎం నిర్ణయానికి స్వాగతిస్తున్నాం.. ఎమ్మెల్యే  పోచారం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Thalli Statue) నమూనా పై సభలో చర్చ జరుగుతోంది. దీనిపై బాన్సువాడ ఎమ్మెల్యే(Bansuwada MLA) పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన అంశంపై సీఎం(CM Revanth Reddy) నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. సంపూర్ణ మద్దతిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు మారుతుంటాయి.. నాయకులు మారుతుంటారు కానీ తెలంగాణ తల్లి రూపకల్పనలో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయని, మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి విగ్రహ రూపకల్పన చేశారని అన్నారు. తెలంగాణ తల్లి అంటే ఎవరో ఒకరికి సంబంధించినది కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశం అని, అందులో తాము కూడా ఒకరమని తెలిపారు.

తాము కూడా ఉద్యమాల్లో పాల్గొన్నామని, గతంలో.. ఇప్పుడు శాసనసభ్యుడుగా ఉన్నామని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో శాసన సభ హుందాగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే శాసన సభ మర్యాదలు, గౌరవాన్ని కాపాడాలని, సభలో మాట్లాడే బాష, వ్యవహరించే తీరు బాహ్యా ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. చిల్లర మల్లర మాటలు బంజేసి, ఒకరినొకరు నిందించుకోకుండా తెలంగాణ ఆదర్శమైన రాష్ట్రంగా పేరు తెచ్చుకోవాలని ఆశించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డకా సంవత్సర కాలంలో చాలా కార్యక్రమాలు జరిగాయని, యువ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనులు బాగా జరుగుతున్నాయని, ఇది అభినందించాల్సిన విషయమని అన్నారు. విగ్రహ రూపకల్పనలో సీఎం చేసిన కృషి అభినందనీయమని, ఈ రోజు జరగబోయే విగ్రహావిష్కరణకు రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అందరూ హాజరై తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలని కోరారు.

Next Story

Most Viewed