బండి సంజయ్‌కి ఏమైనా భవిష్యవాణి తెలుసా..? ఈడీ నోటీసులపై రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-12-16 14:16:13.0  )
బండి సంజయ్‌కి ఏమైనా భవిష్యవాణి తెలుసా..? ఈడీ నోటీసులపై రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకు తనకు ఈడీ నోటీసులు వచ్చాయని.. బండి సంజయ్‌కి ఏమైనా భవిష్యవాణి తెలుసా అని ప్రశ్నించారు. తనకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి నాలుగు రోజుల ముందే ఎలా తెలుసని నిలదీశారు. దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు బండి సంజయ్‌ కింద పని చేస్తున్నాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని గుట్టు రట్టు చేసినందుకే ఈడీ సమన్లు వచ్చాయని భావిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను అడ్డుకున్నందుకే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులకు భయపడేది లేదు.. తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో తన బయోడేటా అగడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

MLA రోహిత్ రెడ్డి ఈడీ నోటీసుల్లో ఊహించని ట్విస్ట్

Advertisement

Next Story