- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Assembly : ఇక శాసనసభ ఆవరణలో ఫొటోలు, వీడియోలు నిషేధం

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభ(Assembly) ఆవరణ(Premises)లో ఫొటోలు, వీడియో(Photos and videos)లు తీయడంపై నిషేధం(Banned) విధించారు. ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డు(Warning boards)లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర శాసనసభలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కొత్తగా ఈ నిషేధ నిబంధనలు అమలుచేస్తున్నారు. ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా ఉండాలనే ఇలా చేశారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఇప్పటి వరకు శాసనసభ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునే వెసులుబాటు ఉండేది.
కేవలం శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీవీ చానళ్లు లైవ్ ఇవ్వొద్దన్న నిబంధనలు అమల్లో ఉండేవి. అయితే ఫొటోలు, వీడియోలపై ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. కొత్తగా ఈ సమావేశాల నుంచే నిబంధనలు తీసుకొచ్చారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ మండిపడుతోంది. ప్రజాపాలన సాగిస్తున్నామని, స్వేఛ్చాయుత పాలన మాదంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలను అమలు చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శాసనసభ లోపల, వెలుపల మా గొంతు నొక్కే ప్రయత్నమే శాసన సభ ఆవరణలో ఫోటోలు, వీడియోలపై నిషేధం అని ఆరోపించింది.