అడ్డుకర్రలతో ప్రజల ఆకాంక్షను ఆపలేరు: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by Kalyani |
అడ్డుకర్రలతో ప్రజల ఆకాంక్షను ఆపలేరు: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి: అడ్డుకర్రలతో ప్రజల ఆకాంక్షను ఆపలేరని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పరిధిలోని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, ఎంపీ రాములు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల అధికారులు, సలహాదారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఏదుల రిజర్వాయర్, టన్నెల్ నిర్మాణం పనులపై సాగునీటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం మీడియాతో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు రావలసిన నీటి వాటాకు అనుగుణంగా సాగునీటి, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని, తాగునీటిని వినియోగించుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్మిస్తున్న సాగునీటి, గునీటి ప్రాజెక్టులను అడుగడుగునా కేసులు వేస్తూ, అడ్డంకులు సృష్టిస్తున్న ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అడ్డంకులను తొలగిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు. 9 సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాను తేల్చకుండా పొరుగు రాష్ట్రాలు చేస్తున్న కుయుక్తులు కన్నా సొంతింటి దొంగలు అడ్డుపుల్లలు వేస్తుండడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడక సాగుతున్నాయని చెప్పారు.

ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించి తదనుగుణంగా చర్యలు చేపట్టి సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు, ఎత్తిపోతల పథకాల సలహాదారులు పెంటా రెడ్డి, చీఫ్ ఇంజనీర్ అహ్మద్ ఖాన్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ రక్షితా కే మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story