- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకే వారి అండ ఉంటది : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకే ప్రజలు అండగా ఉంటారని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఇవాళ మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అన్ని అసెంబ్లీ సీట్లు గెలవడం గొప్ప విషయమని అన్నారు. నగర ఓటర్లు ఎల్లప్పుడ మంచి నాయకులను మాత్రమే ఆదరిస్తారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు ప్రజల అండ ఉంటుందని పేర్కొ్న్నారు. నేతలు ప్రజల ఆలోచనలను ఎపుడూ అర్థం చేసుకుంటూ వాటికి తగినట్లుగా పని చేసుకుంటూ పోవాలని అన్నారు.
నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లాంటి వారికే ఓటమి తప్పలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను చూస్తుంటే విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతోందని తెలిపారు. కొందరు పిచ్చోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని, అభివృద్ది చేయనందుకు బీఆర్‌ఎస్ ఓడలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ కేసీఆర్‌పై ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని పేర్కొన్నారు. రాజకీయాలను వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో చూడాలన అన్నారు. కాంగ్రెస్‌లో ఓకే ముఖ్యమంత్రితో ఐదేళ్లు పాలన సాగిన సందర్భాలు లేవని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.