- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెండింగ్ బిల్లుల కేసు.. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పంపిన బిల్లులకు గవర్నర్ అప్రూవల్ ఇవ్వకపోవడానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జరిగిన వాదనల సందర్భంగా కౌంటర్ అఫిడవిట్ రూపంలో వివరాలను సమర్పించడానికి మరికొంత గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికల్లా వివరాలను సమర్పించాలని న్యాయవాదికి స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ... గవర్నర్ చట్టానికి కట్టుబడి ఉండాలన్నారు. మధ్యప్రదేశ్‌లో బిల్లులను పంపిన వారం రోజుల్లో, గుజరాత్ రాష్ట్రంలో నెల రోజుల్లోనే గవర్నర్ నుంచి ఆమోదం లభిస్తున్నదని, కానీ తెలంగాణలో మాత్రం గతేడాది సెప్టెంబరులో పంపినా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.
తీవ్రమైన జాప్యం జరుగుతున్నందువల్ల ప్రభుత్వం అనుకున్న తీరులో కొన్ని పనులు జరగడంలేదని, గవర్నర్‌కు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలకు తగిన వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. గవర్నర్‌కు నోటీసులు జారీచేయలేమని గత విచారణ సందర్భంగా స్పష్టం చేసిన ధర్మాసనం కేంధ్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. దీంతో సోమవారం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ ఇవ్వడానికి మరికొంత సమయం పడుతున్నందున గడువు ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చీఫ్ జస్టిస్ బెంచ్.. వచ్చే నెల 10వ తేదీకి విచారణను వాయిదా వేసింది.