- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రిటిష్ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు వడ్డే ఓబన్న : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

దిశ, తెలంగాణ బ్యూరో : బ్రిటిష్ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించిన నాటి వీరుడు వడ్డే ఓబన్న, తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అంగ్లేయులపై తన బాల్య మిత్రుడు ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి తో కలిసి వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. శనివారం రవీంద్రబారతిలో ఆయన 218 జయంతోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెల్ల దొరలపై పోరాటంలో సైన్యాధిక్షుడిగా ఓబన్న పోషించిన వీరోచిత పోరాటం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని, ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి తో ఓబన్న మిత్రత్వం బాల్యం నుంచి మరణం వరకు సాగిందన్నారు. 39 ఏళ్ల వయసులోనే వీర మరణం పొందిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసుత్తం కులాలను పక్కన పెట్టీ బీసీలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, బీసీలకు మరెవరు సాటిరానని పేర్కొన్నారు.
కుల గణన సర్వే రాహుల్ గాంధీ చలవనేని, భారత్ జోడో యాత్ర సమయంలో ప్రజల ఆక్రందనలు అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రధాని మోదీ అండతో అంబానీ, అదానీ లక్షల కోట్లకు పరిగెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కుల సర్వే 95 శాతం పూర్తియిందని, రిపోర్టు ఆధారంగా బీసీలు తమ హక్కులు అడగాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీసీల పాత్ర కీలకమని, వడ్డేర కులస్తులు కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో సరిపెట్టుకోవద్దు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను డిమాండ్ చేసేందుకు పరిస్తితి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందని, పదేళ్ల కేసిఆర్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఆరోపించారు. ఒక్క కార్పొరేషన్ కు సంవత్సరంలో లక్ష రూపాయలు ఇచ్చిన పాపానపోలేదన్నారు. బిఆర్ఎస్ నేతలు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధి కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో వడ్డేర కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్తదితరులు పాల్గొన్నారు.