కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసిన పెద్దపల్లి ఎంపీ

by Mahesh |
కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసిన పెద్దపల్లి ఎంపీ
X

దిశ, వెబ్ డెస్క్: 2019 ఎన్నికల్లో బీఆర్ ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన వెంకటేశ్ నేత ఇటీవల కాంగ్రెస్ లో చేరి.. అనూహ్యంగా బీజేపీ‌లో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ లో చేరిన ఆయన బీజేపీ లోకి వచ్చిన తర్వాత మొదటి సారి స్పందించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 2 నెలల్లోనే నాకు అవమానం జరిగింది. అధికారంలోకి రాగానే సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ సమాధి చేసిందని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు.


Next Story

Most Viewed