- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Payal Shankar: సభలో కాంగ్రెస్ వ్యవహారం దుర్మార్గం.. పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly)లో కాంగ్రెస్ (Congress) వ్యవహారం అత్యంత దర్మార్గంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) ఫైర్ అయ్యారు. కుల గణన (Cast Census), ఎస్సీ వర్గీకరణ (Classification of SC) అంశాలపై చర్చ సందర్భంగా సభలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఎమ్మెల్యే అంతా బీజేఎల్పీ (BJLP) కార్యాలయంలో ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) మాట్లాడుతూ.. సభలో అధికార కాంగ్రెస్ (Congress) తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని ఫైర్ అయ్యారు. కనీసం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండానే, సంప్రదింపులు లేకుండానే కేబినెట్ మీటింగ్ (Cabinet Meeting) పేరుతో సభను వాయిదా వేయడం బాధకరమని అన్నారు.
ప్రభుత్వం ఇక నుంచి అయినా.. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. సభా మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. సభా సమయాన్ని వృథా చేయడం మంచి సంప్రదాయం కాదని కామెంట్ చేశారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరగాలని అన్నారు. రాష్ట్రంలోని బీసీలకు, ఎస్సీలకు మేలు జరగాలన్నదే బీజేపీ (BJP) ఆకాంక్ష అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయిందని పేర్కొన్నారు. మరి కొంత కాలం గడిస్తే.. బీఆర్ఎస్ (BRS)కు పట్టిన గతే కాంగ్రెస్ (Congress)కు పడుతుందని.. ఆ విషయం గుర్తు పెట్టుకుని ఇచ్చిన హామీలను అమలు చేయాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.