- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్ ఒక మాఫియా డాన్: నందీశ్వర్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ ఒక మాఫియా డాన్ అని, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారారని పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ పీఎస్సీ పేపర్స్ లీకేజీ మొదలు లిక్కర్ స్కామ్ వరకు అడ్డగోలుగా, అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. లీకేజీ స్కామ్‌లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తముందని అనుమానం వ్యక్తం చేవారు. సిట్ వేసినా వారు కేసీఆర్ కు అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తారని పేర్కొన్నారు.
ప్రభుత్వ పెద్దల హస్తముందనే విషయం బయటపడకుండా ఉండటంలో భాగంగానే గ్రేడ్ 4 ఉద్యోగులను కావాలని ఇరికించారని నందీశ్వర్ గౌడ్ ఆరోపించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని ఎందుకు ఎంక్వయిరీ చేయడం లేదని ప్రశ్నించారు. లీకులు, స్కాములకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ మారిందని ఆరోపించారు. ప్రధాని పదవికి గౌరవమివ్వకుండా మాట్లాడిన మంత్రి కేటీఆర్, పీఎంకు క్షమాపణలు చెప్పాలని నందీశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌పై విమర్శలు చేసే కనీస అర్హత మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు.