Google doodle : గూగుల్ డూడుల్‌లో ‘పానీపూరీ’.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

by Rajesh |   ( Updated:2023-07-12 07:08:13.0  )
Google doodle : గూగుల్ డూడుల్‌లో ‘పానీపూరీ’.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలతో పాటు చిన్నా, పెద్దా ఎక్కువగా ఇష్టపడే పానీ పూరికి గూగుల్ అరుదైన గౌరవం ఇచ్చింది. స్ట్రీట్ ఫుడ్ ఏకంగా గూగుల్ డూడుల్‌గా మారింది. అయితే గూగుల్ ఈ రోజు పానీపూరీల్లో వెరైటీలను తన డూడుల్‌లో ఉంచింది. 2015 జులై 12న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక రెస్టారెంట్ 51 రకాల రుచికరమైన పానీపూరీలను అందించి ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ గూగుల్ తన డూడుల్ లో పానీ పూరీలను ఉంచింది. ఇది చూసిన నెటిజన్లు తమ ఫేవరెట్ ఫుడ్ ఐటంకు గూగుల్ ఇచ్చిన గౌరవానికి థ్యాంక్స్ చెబుతున్నారు. పానీపూరీని గూగుల్ తన డూడుల్ గా ఎందుకు పెట్టిందని కొంత మంది సెర్చ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed