Palvai Sravanthi: కోమటిరెడ్డి సపోర్ట్ నాకే.. పాల్వాయి స్రవంతి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-08-10 11:05:48.0  )
Palvai Sravanthi says Komatireddy Venkat Reddy will support her
X

దిశ, వెబ్‌డెస్క్: Palvai Sravanthi says Komatireddy Venkat Reddy will support her| కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మునుగోడులో పాగా వేసేందుకు ఇప్పటి నుండి కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ తరుణంలో మునుగోడు కాంగ్రెస్ కీలక నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తాను మొదటి నుండి కాంగ్రెస్‌లోనే ఉన్నానని అన్నారు. అయితే, మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణారెడ్డిని బరిలోకి దింపుతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటిపై ఆమె స్పందించారు. కృష్ణారెడ్డి ఎవరో తనకు తెలియదని.. నియోజకవర్గంలో ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కూడా ఆయన ఎవరో తెలియదని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సపోర్ట్ కూడా తనకే ఉందని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించారు.

గాలి పీల్చుకుంటున్న చెట్టు.. న‌మ్మ‌శ‌క్యంకాని షాకింగ్‌ వీడియో!

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed