Minister Ponnam : రేషన్ కార్డులపై ప్రతిపక్షాల రాజకీయ రాద్దాంతం : మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |
Minister Ponnam : రేషన్ కార్డులపై ప్రతిపక్షాల రాజకీయ రాద్దాంతం : మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం(State Governament) తలపెట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ(Issuance of New Ration Cards)ప్రక్రియపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పాత రేషన్ కార్డులు తొలగించడం లేద(No Removal of Old Ration Cardsని, దీనిపై ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తమ ప్రజాప్రభుత్వం రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2కోట్లకు 81లక్షల మందికి సంబంధించి 90లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయని, వాటిని తొలగించడం లేదన్నారు. ఎప్పుడు తప్పులు లెక్కబెట్టే ప్రతిపక్షాలు సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. అర్హత ఉండి గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా ,కొత్తగా పెళ్లి అయిన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులను జారీ చేస్తామని స్పష్టం చేశారు. కుల సర్వే ఆధారంగా.. అప్లికేషన్ ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నారు.

తమ ప్రభుత్వంలో 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశామని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.12వేలు రైతు భరోసా ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ పథకంతో భూమిలేని కూలీలకు రూ.10వేలు ఇవ్వబోతున్నామన్నారు. అలాగే పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరీ చేస్తున్నామన్నారు.

Next Story

Most Viewed