- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాసబ్ ట్యాంక్ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్

X
దిశ, కార్వాన్ : మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసి దగ్గర బుదవారం తెల్లవారుజామున 6 గంటలకు గేర్ ఆయిల్‌ను తరలిస్తున్న లారీ బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న మినీ ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాయి. అందులోనే ఉన్న వందల లీటర్ల ఆయిల్ రోడ్డుపైన పడిపోయింది.
దీంతో లక్డీకాపూల్ నుండి మాసబ్ ట్యాంక్ మీదుగా వెళ్లే దారిలో గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆయిల్ ట్యాంకర్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Next Story