- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
కౌశిక్ రెడ్డికి నోటీసుల అంశంలో ట్విస్ట్.. ఆమె ఫిర్యాదుతోనే NCW యాక్షన్..!
by Satheesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయంలో ఇందిరా శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్‌సీడబ్ల్యూ ఈ కేసును సుమోటోగా స్వీకరించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఇందిరా శోభన్ ఖండించారు.
ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోలేదని.. తన ఫిర్యాదుతోనే చర్యలకు మహిళా కమిషన్ ఉపక్రమించిందని సోమవారం ట్వీట్ చేశారు. ఈ మేరకు తన చేసిన ఫిర్యాదుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్‌ను ఇందిరా శోభన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా కౌశిక్ రెడ్డిని రేపు ఉదయం 11:30 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది.
Next Story