- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఎక్కడ సభ పెట్టుకున్నా.. మాకు భయం లేదు: వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ఎక్కడ సభ పెట్టుకున్నా.. తమకు భయం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ప్రస్తుం కేసీఆర్ చెప్పే అబద్ధాలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలకు కూడా గడవలదేదని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారని సెటైర్లు వేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని.. ఆ విషయంలో బీఆర్ఎస్ నాయకులకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని అన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డపై ప్రాజెక్టులపై విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని హనుమంత రావు అన్నారు.
కాగా, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఈ నెల 13న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు అనుమతి లేదని, 30, 30ఏ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు పోలీసులు నో చెప్పారు. అయితే, తాజాగా ‘ఛలో నల్లగొండ’ సభకు ఎస్పీ చందనా దీప్తి అనుమతి ఇచ్చారు.