- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌ను నమ్మని విపక్ష నేతలు? తేదీ మారినా అందని ఆహ్వానం
దిశ, డైనమిక్ బ్యూరో: 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీలు వేగం పెంచాయి. హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని కమలదళం ప్రయత్నాలు చేస్తుంటే.. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఉమ్మడి కార్యచరణకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 23న విపక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక మీటింగ్ నిర్వహించబోతున్నారు. నిజానికి ఈ మీటింగ్ జూన్ 12నే జరగాల్సి ఉండగా కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్యనేతలు అందుబాటులో లేకపోవడంతో తేదీని ముందుకు పొడిగించారు. అయితే ఈ మీటింగ్ కు సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు అందుకున్న పలువురు విపక్ష నేతలు తమ సుముఖతను వ్యక్తం చేశారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం ఈ మీటింగ్ కు రావాల్సిందిగా ఆహ్వానం అందకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
తొలుత నిర్ణయించిన ప్రకారం జూన్ 12 మీటింగ్ కు ఆహ్వానం అందకపోగా తేదీని జూన్ 23కు మార్చినా గులాబీ బాస్ కు మాత్రం జేడీయూ ఇన్విటేషన్ ఇవ్వలేదు. గతేడాది ఆగస్టులో బిహార్ లో నితీష్ కుమార్ తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్ భారత్ కై కలిసి పోరాడుదామని ప్రకటించారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తొలిమెట్టుగా భావిస్తున్న పాట్నా మీటింగ్ విషయంలో కేసీఆర్ ను విపక్ష పార్టీలు పరిగణలోకి తీసుకోకపోవడం చర్చకు దారీతీస్తోంది. అయితే ఆహ్వానం అందకముందే తాము ఈ మీటింగ్ ను దూరంగా ఉంటామని కేటీఆర్ ప్రకటించారు. కానీ విపక్షాల పార్టీల తీరు మాత్రం మరోలా ఉందనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ పై విపక్ష కూటమిలోని మెజార్టీ పార్టీలకు నమ్మకం కుదరడం లేదని అందువల్లే పాట్నా మీటింగ్ విషయంలో తేదీలు మారినా రెండు సార్లు ఆహ్వానం పంపలేదనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Read more: కేసీఆర్ ఫ్యామిలీకి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూం.. అందరూ అక్కడికే షిఫ్ట్ : రేవంత్ రెడ్డి