- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పండగ రోజైనా ఖుషీ ఖబర్ అందుతుందా...?
దిశ, భిక్కనూరు : పే స్కేల్ అమలు చేయడంతో పాటు, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ సహాయకులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 72 వ రోజుకు చేరుకుంది. భిక్కనూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో పలువురు రెవెన్యూ సహాయకులు మాట్లాడుతూ విజయదశమి పర్వదినం రోజైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మమ్మల్ని చర్చలకు పిలిచినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం తాము చేస్తున్న సమ్మె పట్ల స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చి ఖుషీ ఖబర్ అందిస్తుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.