- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG: వ్యవస్థలన్ని నాశనం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ పాలనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికలను ఉద్దేశించి నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ పాలనలో వ్యవస్థలన్ని నాశనమయ్యాయన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని, ఆయన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో పెద్దల మాట మూగబోయిందన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయులకు ప్రాధాన్యం తగ్గించారని గుర్తు చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ మాటలనే మర్చిపోయిందని విమర్శించారు. ప్రతి ఏడాది జాబ్ కలెండర్ ప్రకటిస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. విద్యార్థులకు విద్యా భరోసా ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పైనా ఇదే వేదికగా కిషన్ రెడ్డి స్పందించారు. పరిపాలనపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి ఆయన ప్రతి సవాల్ చేశారు. చర్చకు తాము సిద్ధమనేనని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి అమలు చేయాలని ఛాలెంజ్ చేశారు. అసలు రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందని చర్చకు రావాలన్నారు. రాష్ట్ర ప్రజలకు విరుద్ధంగా రేవంత్ పాలన ఉందని ఆరోపించారు. తెలంగాణలో పాలకులు మారిన మార్పు మాత్రమే వచ్చిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.