ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయం.. ఎమ్మెల్యే

by Sumithra |
ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయం.. ఎమ్మెల్యే
X

దిశ, నిజాంసాగర్ : మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వాములు, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ అన్నారు. ప్రతి ఒక్కరికి చాకలి ఐలమ్మ ఆదర్శంగా నిలుస్తుందని, ఐలమ్మ పోరాటం నేటి మహిళలకు, సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి సముచిత గౌరవం కల్పించిందన్నారు. ఐలమ్మ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. రజక సామాజిక వర్గానికి తాను అండగా ఉంటానని, పిల్లల చదువులు, ఉద్యోగాల విషయంలో తోడ్పాటు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చీకోటి జయ ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మండలాల అధ్యక్షులు ఏలే.మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, మండల రజక సంఘం అధ్యక్షుడు చాకలి పెద్ద గంగారాం, అనీస్ పటేల్, ప్రజా పండరి చీకోటి మనోజ్ కుమార్, గాండ్ల రమేష్, అబ్దుల్ కాలేక్, నాగభూషణం గౌడ్ మల్లయ్య గారి ఆకాష్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లోక్య నాయక్, తహశీల్దార్ బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed