MLA Prashanth Reddy : కాకతీయ, లక్ష్మీ కాలువలకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే..

by Sumithra |   ( Updated:2024-08-07 12:38:58.0  )
MLA Prashanth Reddy : కాకతీయ, లక్ష్మీ కాలువలకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే..
X

దిశ, బాల్కొండ : వానాకాలం పంటల కొరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి లక్ష్మి కాకతీయ కాలువలకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. లక్ష్మీ కాలువకు మాన్యువల్ పద్ధతిలో గేట్లను ఎత్తి నీటి విడుదలను ప్రారంభించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న జల విద్యుత్ పత్తి కేంద్రంలో విద్యుత్ టర్బైన్ ను బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువలో ప్రవహిస్తున్న నీటికి పూలుచల్లి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగంపేట్ శేఖర్ రెడ్డి, ముస్కు భూమేశ్వర్, రాజారెడ్డి, బద్దం నర్సారెడ్డి, బద్దం ప్రవీణ్, జోగు నరసయ్య, విస్బ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed