- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bankers : బ్యాంకర్ల నిర్లక్ష్యంతో వర్తించని రుణమాఫీ...
దిశ, ఆలూర్ : రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా మంజూరు చేసిన రుణమాఫీ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో అర్హులైన కొందరు రైతులకు అందకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు ఆలూర్ మండలంలోని కెనరా బ్యాంక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 100 మంది రైతులకు రుణమాఫీ బకాయిలు అందలేదు. పలుమార్లు రైతులు బ్యాంకు చుట్టూ తిరిగినా బ్యాంక్ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు బ్యాంకు ముందు నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని బ్యాంకుల్లో రుణమాఫీ వర్తిస్తే కేవలం కెనరా బ్యాంక్‌లోనే రైతులకు ఎందుకు రుణమాఫీ వర్తించదు అని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న ఆలూర్ తహశీల్దార్ నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి నివేదించి రుణాలు అందేవిధంగా కృషి చేస్తానని చెప్పడంతో రైతులు శాంతించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న....
రుణమాఫీ పథకం అర్హులైన రైతులకు అందడం లేదు. సాంకేతిక కారణాలతో పాటు ఆధార్‌కార్డుల్లో పేర్లలో, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఇతర తప్పులు రావడంతో అర్హులకు రుణమాఫీ అందడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మాఫీ వర్తించలేదు.. లాడే అనిల్ రైతు...
బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని అనుకున్నా, ప్రభుత్వం లెక్కల ప్రకారం ఎలిజిబులిటీ ఉన్న కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాఫీ జరగలేదు, 2020 సంవత్సరంలో క్రాప్ లోన్ తీసుకున్న బ్యాంక్ అధికారులు తప్పుగా డాటా షేర్ చేయడంతో రుణమాఫీ వర్తించలేదు.
ఆశగా ఎదురు చూస్తాను.. కుర్మ మల్లేష్.. రైతు
కెనరా బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నాను. కానీ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మాఫీ జరగడం లేదు, వ్యవసాయాధికారు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నానని అన్నారు.
ప్రభుత్వానికి నివేదిస్తాం..
మాకు అందుబాటులో ఉన్న రుణమాఫీ పోర్టల్ లో రైతులకు స్టేటస్ మాత్రం చూడగలం అని, సాంకేతిక సమస్యల వివరాలు, అర్హులు ఉండి మాఫీ కానీ రైతుల వివరాలను నమోదు చేసి పై అధికారులకు నివేదిక అందిస్తాం. రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాలు, సూచనలు వచ్చేవరకు వేచిచూసి, అర్హులకు రుణమాఫీ వచ్చేలా చేస్తాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దంటున్నారు వ్యవసాయ అధికారులు, హరి కృష్ణ ఏవో.
సమస్యలు పరిష్కరిస్తాం.. మృత్యుంజయ జోషి .. కెనరా బ్యాంక్ మేనేజర్
అర్హులైన రైతులకు మొదటి, రెండో దశలో రుణమాఫీ జరగలేదని తమ దృష్టికి వచ్చిందని, సమస్యల పై అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రైతులకు రుణమాఫీ జరిగే విధంగా చూస్తామని అని అన్నారు.