ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి ఎన్నిక

by Sridhar Babu |
ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి ఎన్నిక
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం బ్యాంక్ ఆవరణలోని మీటింగ్ హాల్లో డీసీఓ శ్రీనివాస్ రావు చేతుల మీదిగా నియామక పత్రం అందుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రమేష్ రెడ్డిని పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. 21న అవిశ్వాసం నెగ్గడంతో మంగళవారం తన మీద నమ్మకం తో డైరెక్టర్లు సహకరించి తనను ఏకగ్రీవం గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

దీనికి సహకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్ లకు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎల్లప్పుడూ జిల్లా రైతన్నలకు తన సహకారం ఉంటుందని, రైతులకు, డైరెక్టర్లకు, ఉద్యోగులకు అందుబాటులో ఉంటారని అన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా

బ్యాంకు అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు. డీసీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ..మార్చ్ 21 న అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పదవి ఖాళీ కావడంతో ఈరోజు నామినేషన్ ప్రక్రియ నిర్వహించామని, చైర్మన్ పదవికి కుంట రమేష్ రెడ్డి ఒక్కరే నాలుగు సెట్లు నామినేషన్ వేశారని, స్క్రూటినీ అనంతరం ఒక్కరే ఉండడంతో కుంట రమేష్ రెడ్డిని ఏకగ్రీవంగా చైర్మన్ గా ప్రకటించినట్టు చెప్పారు. పాలక వర్గం 21 మందికి గాను 18 మంది హాజరు అయ్యారని అన్నారు.

Advertisement

Next Story