- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kamareddy Municipality: కమిషనర్ మారినా పేరు మారలే..! అధికారిక వెబ్‌సైట్‌లోనూ అంతే
దిశ, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ అధికారుల తీరు ప్రజలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారులు మారుతున్నా.. ప్రస్తుతం ఏ అధికారి విధులు నిర్వర్తిస్తున్నాడో అన్న సమాచారాన్ని బోర్డుపై తెలియజేయడం లేదు. కామారెడ్డి మున్సిపల్ కొత్త కమిషనర్‌గా సుజాత గత ఫిబ్రవరి 15న బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఉన్న కమిషనర్ దేవేందర్ ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. అయితే, కమిషనర్ ఛాంబర్ వద్ద ఏ అధికారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించారో తెలిపే బోర్డును కూడా ఏర్పాటు చేశారు. 2012 నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి మున్సిపల్ కమిషనర్లుగా పనిచేసిన వారి పేర్లు అందులో పొందుపరచాల్సి ఉంటుంది.
కానీ, గత కమిషనర్ దేవేందర్ మే 05, 2020న కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి గత ఫిబ్రవరిలో బదిలీపై వెళ్లారు. అయితే, కొత్త కమిషనర్ సుజాత వచ్చి 6 నెలలు గడుస్తున్నా కమిషనర్ల బోర్డులో ఇంకా ఆమె పేరు చేర్చకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అదేవిధంగా మునిసిపాలిటీ అధికారిక వెబ్‌సైట్ కూడా సైతం కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా ఇంకా దేవేందర్ పేరే దర్శనమిస్తోంది. అధికారుల ట్రాన్స్‌ఫర్స్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సిన అధికారులు మాకెందుకులే అనుకుంటూ కాలం వెల్లదీస్తుండగా.. ఇదేం పద్ధతి అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నేమ్ బోర్డు, వెబ్‌సైట్లలో కొత్త కమిషనర్ పేరును చేరుస్తారా.. కాలయాపన చేస్తారా వేచి చూడాలి మరి.