- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ జిల్లాలో పెరిగిన గన్ కల్చర్.. తుపాకులతో..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అంక్సాపూర్ బ్యాంక్ మేనేజర్ అవినాష్ ను ఈ నెల 2న పోచంపల్లి సర్పంచ్ అనంత్ రావు గన్ తో బెదిరించాడు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు మాక్లూర్ మండలం కల్లెడి గ్రామసర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ ఏకంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి గన్ తో ప్రవేశించిన విషయం తెల్సిందే. రెండు ఉదాహరణలు సరిపోతాయి నిజామాబాద్ లో గన్ కల్చర్ పెరిగిపోయాయని అనడానికి. ఒకప్పుడు కేవలం ఆత్మరక్షణ కోసం తీసుకున్న ఆయుదాలు ఇప్పుడు సెటిల్ మెంట్లకు, బెదిరింపులకు ఉపయోగపడుతున్నాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జారీ అయిన తుపాకులు ఒకవైపు, అక్రమంగా కొనుగోలు చేసిన తుపాకులు ఒకవైపు అన్నట్లు పరిస్థితి మారిపోయింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. చీటికిమాటికి అవసరం ఉన్నా లేకపోయినా తుపాకితో బెదిరింపులు కామన్ అయ్యాయి. ఒకప్పుడు పీపుల్స్ వార్ (మావోయిస్టు) పార్టీ కార్యకలాపాలు జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం చాలా మందికి గన్ లైసెన్స్ లు జారీ అయ్యాయి. అంతేగాకుండా అప్పుడు నక్సల్స్ తో ప్రాణభయం ఉన్న వారికి కేటాయించిన గన్ లతో సెటిల్ మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు పెరిగాయి. ముఖ్యంగా రియల్ మాఫియా చాలా మందికి గన్ లే సెటిల్ మెంట్లకు ఆధారంగా మారాయి. లైసెన్స్ లు ఉన్న గన్ లతో బెదిరింపులు ఒకవైపు ఉండగా ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన తుపాకులు జిల్లాలో దర్శనమిస్తున్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి గన్ లు తెచ్చి ఇక్కడ సెటిల్ మెంట్ చేసే పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలోనే గన్ లకు సంబంధించిన ఆర్మ్ స్ యాక్టు కేసులు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమౌతుంది. వేల్పూర్ మండలం అంక్సాపూర్ బ్యాంక్ మేనేజర్ అవినాష్ ను అధికార పార్టీకి చెందిన మంత్రి అనుచరుడు పోచంపల్లి సర్పంచ్ అనంత్ రావు దేశ్ పాండే ఎయిర్ గన్ తో బెదిరించిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. చివరకు పోలీసులు కేసునమోదు చేశారు. సర్పంచ్ పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం కలకలం రేపుతుంది. సిరికొండ అటవి ప్రాంతంలో మాచారెడ్డి మండలం రెడ్డిపేట్ కు చెందిన వ్యక్తిని జనవరి 23న సహచరులు నాటుతుపాకితో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
సదాశివనగర్ మండలంకు చెందిన ఓ మాజీ ఏకంగా భూ పంచాయతీలో గన్ తో బెదిరించిన ఉదంతంపై కేసునమోదయింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గంజాయి కోసం ఆబ్కారి అధికారులు తనిఖీలకు వెళ్లగా అక్కడ వ్యక్తి నుంచి రెండు నాటుతుపాకులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గడిచిన ఏడాది కామారెడ్డి శివారులో దాబా వద్ద ఓ వ్యక్తి గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు గన్ లైసెన్స్ లేకుండానే ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో విచారించారు. నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డులో దుబ్బకు చెందిన ఒక వ్యాపారి భూమి విషయంలో జీఆర్ గ్యాంగ్ సభ్యులు తుపాకితో బెదిరించిన ఘటన ఉంది.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అటవి ప్రాంతంలో మరో గ్యాంగ్ జింకులను వేటాది పారిపోతుండగా పట్టుకునేందుకు పోలీసులు మాచారెడ్డి వరకు చేజింగ్ చేసి సాహసంతో పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. పోలీసు శాఖ జారీ చేస్తున్న గన్ లు ఇప్పుడే ఏకంగా ఆత్మరక్షణకు కాదని సెటిల్ మెంట్లకేనని స్పష్టమౌతుంది. ఇటీవల కాలంలో అధికార పార్టీలీడర్లు కొందరు వ్యాపారులు స్టేటస్ కోసం గన్ లైసెన్స్ లు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రతియేడాది గన్ ల వివరాలను సేకరించి వాటి వినియోగం పై పోలీసుశాఖ నజర్ వేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మాత్రమే ఆయుదాలను తీసుకుని ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఆర్మ్ స్ యాక్టు కేసులు నమోదువుతున్నా లీడర్లు, గన్ లు కలిగిన వ్యక్తుల పై నజర్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.