గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి: డీఎస్పీ నాగేశ్వరావు

by Mahesh |
గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి: డీఎస్పీ నాగేశ్వరావు
X

దిశ, తాడ్వాయి: రానున్న గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరావు అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం గణేష్ మండపాల నిర్వాహకులతో పీస్‌ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. గణేష్‌ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. గణేష్‌ మండపాల నిర్వాహకులు విగ్రహాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకోవాలన్నారు.

వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం నిర్వాహకులు సంబంధిత పోర్టల్‌లో అన్ని వివరాలు పొందుపరిచి అప్లికేషన్ సంబంధిత పోలీస్‌స్టేషనలో అందజేయాలని సూచించారు. మండపాల ప్రాంగణల వద్ద విద్యుత్ ప్రమాదాలు ఎలాంటి సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ముఖ్యంగా యువత శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా ఎవరు పూనుకున్న చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని సూచించారు. డీజే లకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లభించదని కరాకండిగా చెప్పేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్ కుమార్, గ్రామ ప్రత్యేక అధికారి రాజేశం, భిక్కనూర్ సిఐ సంపత్, ఎస్సై పుష్పరాజ్,యువజన సంఘాల నాయకులు,మండపాల నిర్వాహకులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed