ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

by Nagam Mallesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
X

దిశ, నవీపేట్ : నవీపేట మండలంలోని అబ్బాపూర్(ఎం) వద్ద బాసర రోడ్డుపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నుంచి బోధన్ లో హజ్రత్ సయ్యద్ జలాల్ బుఖారి జరుగుతున్న ఉర్సుకు కారులో పలువురు బయల్దేరారు. మార్గమధ్యలో అబ్బాపూర్(ఎం) పెట్రోల్ పంప్ వద్ద అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఫైసల్(25) అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story