మార్కెట్ కమిటీ గేటుకు తాళాలు వేసిన రైతులు

by Sumithra |
మార్కెట్ కమిటీ గేటుకు తాళాలు వేసిన రైతులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మార్కెట్ కు పసుపు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు జరుపడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ శ్రద్దానంద్ గంజ్ లో మూడు ప్రధాన గేట్లకు తాళాలు వేసి నిరసనకు దిగారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా తీసుకువచ్చిన పసుపును తేమ శాతం తక్కువగా ఉందని, రైతులతో మార్కెట్ కమిటీ సమావేశం జరుగడం లేదని, ట్రేడర్లతో మద్దతు ధర జరుగలేదన్న సాకుతో పసుపును కొనుగోలు చేయడం లేదని రైతులు మంగళవారం సాయంత్రం గేట్లకు తాళాలు వేశారు.

సోమవారం నుంచి తెచ్చిన పసుపును కొనుగోలు చేయకపోవడంతో వారు నిరసనకు దిగారు. అసలే మద్దతు ధర లేదని రైతులు ఆందోళన చెందుతుంటే తేమ శాతం తక్కువగా ఉందని అన్నీ లాట్ లను ఒకే ఘాటున కట్టి కొనుగోలు చేయకపోవడంపై మండిపడ్డారు. దళారులు, వ్యాపారులు కుమ్మకై పసుపు ధరను పెంచడం లేదని వాపోయారు. 12 శాతం తేమ ఉన్న బస్తాలను మార్కెట్ కు తెచ్చి 24 గంటలు గడిచినా ఎందుకు కొనుగోలు చేయడం లేదని మరికొందరు మండిపడ్డారు. పాత పసుపు కొనుగోలు పూర్తయిన తర్వాతనే కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖాధికారులు చెప్పడాన్ని రైతులు తప్పుపట్టారు.

ఇదే విషయంలో అధికారులను అడుగుదామంటే మార్కెట్ కమిటీ సెక్రటరి అందుబాటులో లేడని రైతులు మండిపడ్డారు. ఈ నెల 13న, 14న మార్కెట్ కు వచ్చిన 20 క్వింటాళ్ల బస్తాలు మార్కెట్లో ఉన్నాయని వాటిని 15 నుంచి 17 వరకు సంబందిత సరుకులు అమ్మకాలు చేస్తామని మార్కేట్ కమిటి అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు మార్కేట్ కు సెలవులు కారణంగా 21 నుంచి పసుపును మార్కేట్ కు తీసుకురావాలని, పచ్చి పసుపు తీసుకురావద్ధని మార్కేట్ కమిటి అధికారులు ప్రకటన జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed