- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సినీ ఫక్కీలో.. అక్రమంగా గోవుల రవాణా..
దిశ, భిక్కనూరు : సినీ ఫక్కిలో గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని చేజింగ్ చేసి పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది, యువత పట్టుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ లో దొంగతనంగా గోవులను రవాణా చేస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా భిక్కనూరు పోలీసులకు అనుమానం వచ్చి ఆ డీసీఎం వ్యానును ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకొని వెళ్ళిపోయింది. అంతే కాకుండా వాహనాన్ని టోల్ ప్లాజా వద్ద కూడా ఆపకుండా, బారీ కేడ్లను ఢీ కొడుతూ వాహనంతో పరారయ్యారు. వ్యాన్ లో రెండు సైడ్ ల బియ్యం సంచులు మాదిరిగా సంచులను పేర్చి, వాటి మధ్యలో పెద్ద ఎత్తున గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని చేజింగ్ చేసి పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టోల్ ప్లాజా సిబ్బందితో పాటు బస్వాపూర్ గ్రామానికి చెందిన యువకులు భారీ సంఖ్యలో రోడ్డు పై చేరుకొని ఆ వాహనాన్ని ఆపేందుకు విఫల యత్నం చేశారు. చివరకు మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద వాహనాన్ని పక్కన నిలిపివేసి అందులోని డ్రైవరు, క్లీనర్లు పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట, భిక్కనూరు మండలాల విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని గోవులను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని బహిరంగంగా ఉరి తీయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.