'చైర్మన్, సీఈఓ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..'

by Sumithra |
చైర్మన్, సీఈఓ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..
X

దిశ, కోటగిరి : పోతంగల్ సహకార సంఘంలో పాలకవర్గం వైఫల్యం సీఈఓ నిర్లక్ష్యం వలనే సంఘానికి నష్టం వాటిల్లిందని విచారణ కమిటీ తేల్చి చెప్పింది. 89వ మహాజన సభ సమావేశంలో 51 ఎంక్వయిరీ కమిటీ నివేదికను డీసీఓ శ్రీనివాస్ రావు సంఘ సభ్యులకు వివరించారు. ప్రస్తుత పాలక వర్గం వైఫల్యం సీఈఓ నిర్లక్ష్యం వల్లే సంఘం నష్టానికి కారణమని వెంటనే పాలక వర్గాన్ని రద్దు చేసి సీఈఓను తొలగించి 51 యాక్ట్ ప్రకారం విచారణ చేపట్టాలని సంఘ సభ్యులు డీసీఓకు ఫిర్యాదు చేయగా ఫిబ్రవరి 22 వ తేదీన డీసీఓ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారి అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నివేదికను గురువారం డీసీఓ శ్రీనివాస్ రావు సంఘ సభ్యులు సమక్షంలో ప్రవేశ పెట్టారు.

నివేదిక రిపోర్ట్ ను సభ్యులు సమక్షంలో డీసీఓ చదివి వినిపించారు. నివేదిక ఆధారంగా సంఘంలో పరిపాలన లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వలన సంఘానికి ఆర్థిక నష్టం జరిగిందని నిర్లక్ష్యం వల్ల నిధులు దుర్వినియోగం జరిగిన మొత్తానికి చైర్మన్, సీఈఓనే పూర్తి బాధ్యత వహించాలని, పాలక వర్గం వైఫల్యమే, సహకార సంఘం చట్టానికి విరుద్ధంగా వ్యవహరించి సంఘం ఆర్థికంగా నష్టానికి కారణమైన చైర్మన్, సీఈఓల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ తేల్చి చెప్పింది. సుమారు రెండున్నర కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించి లాభాలుగా చూపించే ప్రయత్నం చేసినందుకు వెంటనే పాలకవర్గాన్ని రద్దుచేసి సీఈఓను తొలగించాలని సభ్యులు డిమాండ్ చేస్తూ డీసీఓ సమక్షంలో తీర్మానం చేశారు.

Advertisement

Next Story

Most Viewed