- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంటగ్యాస్ లీక్.. తప్పిన భారీ ప్రమాదం
తాడ్వాయి మండల కేంద్రంలో ఘటన
దిశ, తాడ్వాయి : వంట గ్యాస్ లీకై.. ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సుర్కంటి రుక్మబాయి వంట గదిలో వంట చేస్తుండగా సీలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కేకలు వేస్తూ.. గ్యాస్ స్టౌవ్, సిలిండర్ ను రుక్మబాయి ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చింది. అదేవిధంగా వంట గదిలో మంటల్లో చిక్కుకున్న మనవరాలు శృతి మోకాలి వరకు గాయాలు కాగా, తనను బయటకు తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు గాయలతో ఉన్న శృతిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. రుక్మబాయి పెద్దగా కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకుని సిలిండర్ నుంచి ఎగిసిపడుతున్న మంటలపై నీళ్లు చల్లినా ప్రయోజనం లేకపోయింది. అదే సమయానికి అగ్నిమపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలు అర్పివేయడంతో ఘోర ప్రమాదం తప్పినట్లైంది.