- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలి..
దిశ, భిక్కనూరు : బాలింతలు, గర్భిణీలకు సంబంధించిన వివరాలతో పాటు, ఓపీ వివరాలను మొత్తం రికార్డులకెక్కించి అప్ డేట్ చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం భిక్కనూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. న్యూట్రిషన్ కిట్స్, సీఎం కేసీఆర్ కిట్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని తెలుసుకునేందుకు మంగళవారం సీఎం ఓ కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్వేతా మహతి, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేసి పరిశీలించనున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అవసరమైన అన్నిజాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
రికార్డులను అప్డేట్ చేసి ఉంచాలని, ఆరోగ్య కేంద్రంతోపాటు పరిసరాలను సైతం క్లీన్ గా ఉంచాలని, ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా బాలింతలకు గర్భిణీలకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేసే విధంగా ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. రెండు అంగన్వాడి కేంద్రాలను సైతం తనిఖీ చేయనుండడంతో మండల కేంద్రంలోని కొత్తపేటలో అంగన్ వాడి కేంద్రాలు 4, 13, కేంద్రాలను సందర్శించి, పిల్లల వివరాలు, పౌష్టికాహార వివరాలు సెంటర్ ఇన్ ఛార్జ్ లు జ్యోతి, లింగాల సునీతలను అడిగి తెలుసుకున్నారు. ఆహ్లాదాన్ని కలిగించే విధంగా సెంటర్ ను తయారు చేయాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ శోభారాణి, భిక్కనూరు తహసిల్దార్ ప్రేమ్ కుమార్, ఎంపీడీవో అనంతరావు, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ తునికి వేణు, ఉపసర్పంచ్ బోడనరేష్, ప్రాథమిక వైద్యాధికారిని యేమీమా తదితరులు ఉన్నారు.