వికాస్ కళ్ళ ఆపరేషన్ ఖర్చు మాదే.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |   ( Updated:2023-12-18 05:36:09.0  )
వికాస్ కళ్ళ ఆపరేషన్ ఖర్చు మాదే.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, గాంధారి: వికాస్ కళ్ళ ఆపరేషన్‌కు అయ్యే పూర్తి ఖర్చు మేమే భరిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని లొంక తండా‌కు చెందిన వికాస్ అంధుడైన అతని పాటలకు స్వయానా రేవంత్ రెడ్డి మంత్ర ముగ్ధుడైన సంఘటన గాంధారి లో చోటు చేసుకుంది. టిపిసిసి అధ్యక్షునిగా ఉన్న తరుణంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ముందు అంధుడైన బాలుడు వికాస్ కాంగ్రెస్ గురించి పాట పాడి రేవంత్ రెడ్డి చేత ప్రశంసల జల్లు కురిపించుకున్నాడు.

రేవంత్ రెడ్డి అప్పటికప్పుడే స్టేజ్ మీద ఉన్న వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కి రెండు లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని అనడంతో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్కడికక్కడే స్వయానా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండు లక్షల రూపాయలను అంధుడైన వికాస్ కు అందజేయడం జరిగింది. అప్పుడు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే నిన్ను ఎవరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా నేను మాత్రం తోడుంటానని మాట ఇచ్చాడు. అది ఈ రోజు నిలుపుకోవడం తో తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed