కేసీఆర్‌ ఆస్తులు టాటాబిర్లా కంటే ఎక్కువ..

by Vinod kumar |
కేసీఆర్‌ ఆస్తులు టాటాబిర్లా కంటే ఎక్కువ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్‌ ఆస్తులు టాటాబిర్లా కంటే ఎక్కువ అని, రూ.10 లక్షల కోట్లు కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని దుబ్బాలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ అలి షబ్బీర్ తరపున చత్తీస ఘడ్ సీఎం భూపేష్ భాఘెల్, విజయశాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో అడుగుఅడుగున బెల్ట్‌షాపులు, యువతను గంజాయిలో ముంచిందన్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం ఇసుక దందా, గ్రానైట్, మొరం దందా, ప్రాజెక్ట్‌లలో కమిషన్లు వసూళ్లు చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో స్లీపర్‌ చెప్పులు వేసుకొని తిరిగిన కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఇప్పడు కోట్లాకు ఎదిగారని, తెలంగాణ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతునే బ్రతుకుతున్నారన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టి కేసీఆర్‌ పైసలతో దేశంలో ఉన్న ప్రతిపక్షాలను కోనుగోలు చేసి రాజకీయాలు చేయాలని చూశాడని కానీ వారు నమ్మలేదన్నారు. కాలేశ్వరంకు 80 వేల కోట్లు పెట్టిన కమిషన్లతో నాణ్యత లేకపోవడంతో మేడిగడ్డ ప్రాజెక్ట్‌ ఫిలర్లు క్రుంగి పోయినట్లు తెలిపారు. రూ.1600 కోట్లతో సచివాలయం నిర్మించిన అక్కడికి ప్రజలను లోనికి వెళ్లనీయడం లేదన్నారు. కేసీఆర్‌ అక్కడ ఉండి హైదరాబాద్‌ను రాజ్యం ఏలాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కమిషన్ల వచ్చే పనులను మిస్టర్‌ కేసీఆర్‌ పనులను చేస్తున్నారని, తెలంగాణ ప్రజలకు అవసరమైన పనులను చేయడం లేదని అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు సమాధి కట్టాలన్నారు.

తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో కేసీఆర్‌ పార్లమెంట్‌ నుంచి వాకౌట్ చేశారన్నాు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ ఏర్పడేది కాదనీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళను సాకారం చేశారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు మార్పు కోరినట్లే బీఆర్ ఎస్ పార్టీని ఎన్నికల్లో ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ సభలో నిజామాబాద్ అర్బన్ పరిశీలకులు ఎ.బి. శ్రీనివాస్, పీసీసీ నాయకులు గడుడు గంగాధర్, తాహెర్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, నగర అధ్యక్షులు కేశ వేణు తదితరులున్నారు.

Next Story