ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్

by Sridhar Babu |
ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీకి శనివారం రాత్రి మరో షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ ప్రథమ చైర్మన్, జిల్లా పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు మేక త్రివేణి గంగాధర్ శనివారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఆర్మూర్ మున్సిపల్ ఏర్పడిన తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ట్ర మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి ఆశీస్సులతో ఆర్మూర్ మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ తరఫున త్రివేణి గంగాధర్ దక్కించుకున్నారు. అటు తర్వాత 2018 వ సంవత్సరంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సమక్షంలో

బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి శనివారం రాత్రి బాల్కొండ నియోజకవర్గం లోని బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు బాల్కొండకు వచ్చిన విజయశాంతి సమక్షంలో శనిగరం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయశాంతి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలనిఆమె త్రివేణి గంగాధర్ కు సూచించారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా త్రివేణి గంగాధర్ నామినేషన్ దాఖలు చేసి పోటీలో ఉన్నారు. కాగా శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారాలు నిర్వహించి వినయ్ రెడ్డిని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని త్రివేణి గంగాధర్ పేర్కొన్నారు.

Next Story