- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుకున్న లక్ష్యాన్ని సాధించిన యువకుడు..
దిశ, తాడ్వాయి : వారిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. చదివింది ప్రభుత్వ పాఠశాలలో అయినా ఎంచుకున్న లక్ష్యం మాత్రం మరువలేదు ఓ యువకుడు. తాడ్వాయి మండలంలోని దేమీకలాన్ గ్రామానికి చెందిన రాపోలు శ్రీకాంత్ కు చిన్నప్పటినుండి ఇండియన్ ఆర్మీలో చేరాలనే ఆశ. అదే సంకల్పంతో వరంగల్ లో చేపట్టిన అగ్నివీర్ ర్యాలీలో సెలక్ట్ అయ్యాడు. చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవంతో మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడిందని అన్నాడు.
గ్రంథాలయానికి ప్రతిరోజు వచ్చి చదువుకోవడం వలనే ఇండియన్ ఆర్మీ పరీక్షలో ఉత్తీర్ణత అయ్యాడు. పట్టువిడవని విక్రమార్కుడిగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక పోయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నాడు. ఈ సందర్బంగా ఇండియన్ ఆర్మీలో ఎంపికైనందుకు గురువారం గ్రంథాలయ నిర్వాహకుడు రాజలింగం శ్రీకాంత్ కు శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్ రాజు, కర్ణాకర్, రవి, రాములు, రాజిరెడ్డి, గంగారెడ్డి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.