మూతపడిన కళాశాలలో అగ్ని ప్రమాదం

by Sridhar Babu |
మూతపడిన కళాశాలలో అగ్ని ప్రమాదం
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మూతపడిన శ్రీ గాయత్రీ కళాశాలలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో గల మూతపడిన శ్రీ గాయత్రి కళాశాలలో మంటలు వ్యాపించడాన్ని గమనించిన స్థానిక కాలనీవాసులు ఆర్మూర్ లోని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. స్థానికులు అందించిన సమాచారంతో ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మూతబడిన శ్రీ గాయత్రీ కళాశాల వద్దకు చేరుకొని ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక శాఖ అధికారులు ఆర్పి వేశారు. ప్రమాదంలో జరిగిన నష్టంపై పూర్తిస్థాయి వివరాలు ఇంకా తెలియ రాలేదు.

Advertisement

Next Story