Kalyani project: కళ్యాణి ప్రాజెక్టులోకి 650 ఇన్ ఫ్లో...రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల...

by Kalyani |
Kalyani project: కళ్యాణి ప్రాజెక్టులోకి 650 ఇన్ ఫ్లో...రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల...
X

దిశ, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కళ్యాణి ప్రాజెక్టులోకి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి సోమవారం 650 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. దీంతో కళ్యాణి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్ల కాగా ప్రస్తుతం 408.50 మీటర్ల నీరు నిల్వ ఉందని ఎగువ నుంచి వస్తున్న నీటిని ప్రాజెక్టు నిండుకోవడంతో నీటిని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి 450 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తునందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Next Story