108 అంబులెన్స్ లో ప్రసవం... తల్లీ, బిడ్డ క్షేమం

by Shiva |
108 అంబులెన్స్ లో ప్రసవం... తల్లీ, బిడ్డ క్షేమం
X

దిశ గాంధారి : గాంధారి మండల పరిధిలోని వండ్రికల్ క్యాంప్ గ్రామానికి చెందిన అనూష (20) పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా అంబులెన్స్ సిబ్బంది అక్కడి చేరుకున్నారు. తక్షణనమే అనూషని హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమవడంతో, కష్టపడి అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేశారు. మొదటి ప్రసవం కావడంతో మగ బిడ్డకు బొడ్డు తాడు మెడలో చుట్టుకొని రావడంతో చాకచక్యంగా ప్రసవం చేశారు 108 సిబ్బంది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల నిమిత్తం ఇరువురిని కామారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిక తరలించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖ ప్రసవం చేసిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రభాకర్, పైలట్ మోహిన్ లను కుటుంబ సభ్యులు అభినందించారు.

Advertisement

Next Story