Nirmal: దొంగే, దొంగా.. దొంగా.. అని అరిచినట్టుంది!.. దొంగతనం కేసులో బిగ్ ట్విస్ట్!

by Ramesh Goud |
Nirmal: దొంగే, దొంగా.. దొంగా.. అని అరిచినట్టుంది!.. దొంగతనం కేసులో బిగ్ ట్విస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన దొంగతనం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో దొంగే తిరిగి దొంగా.. దొంగా.. అని అరిచినట్టుంది. పట్టణంలోని మహదేవపూర్ కాలనీలో అనిత రాణి, సాల్వే శివ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారిలో అనిత పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయురాలుగా పని చేస్తుంది. రోజు లాగే శివ తన భార్యను స్కూల్ లో దింపి.. సాయంత్రం తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చే సరికి తాళం పగల కొట్టి డోర్ తెరిచి ఉంది. ఇంట్లోని వస్తువులు అన్ని చిందరవందరగా పడి ఉండటంతో దొంగలు పడ్డారని భావించారు.

ఇంట్లోకి వెళ్లి చూడగా.. 8 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి సహా డబ్బు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని ఇద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. సీసీ కెమెరాల నిఘా ప్రకారం అనిత భర్త శివ దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై శివను తీసుకెళ్లి విచారించగా తానే దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతని వద్ద నుంచి బంగారం, వెండి సహా పోయిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శివను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story