- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు..
దిశ, నిజామాబాద్ క్రైం : నలుగురు చిన్నప్పటి స్నేహితులు జల్సాల కోసం అలవాటు పడి తాళాలు వేసిన ఇళ్లను దోచేయడం ఇంటి ముందు చేసిన వాహనాలను తస్కరించడం చేస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలపై విచారణలో భాగంగా శనివారం నిజామాబాద్ మార్వాడిగల్లిలో గౌతమ్ నగర్ కు చెందిన సూర్యవంశం సాయికుమార్, శ్రవన్ యాదవ్, ఇటుకల మహేష్, నితిన్ లను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు.
నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలో బైక్ దొంగతనాలు, ఇళ్ల దోపిడీ కేసులు కొలిక్కి వచ్చాయని ఎసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి 4 బైక్ లు, 2 స్కూటీ లు, తులంన్నర బంగారు నెక్లెస్, జడ పువ్వులు, బంగారు ఉంగరం, బంగారు చైన్, వెండి పట్టే గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో మాక్లూర్ ఎస్సై యాదగిరి గౌడ్, రూరల్ సీఐ నరహరిలను సీపీ అభినందించినట్లు ఎసీపీ తెలిపారు.