KCR: గుణాత్మకమైన మార్పులు అవసరం

by Gantepaka Srikanth |
KCR: గుణాత్మకమైన మార్పులు అవసరం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 2025 లో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.

Next Story

Most Viewed