T PCC: ఉవ్విళ్ళూరుతున్న మీకు నిరాశ తప్పదు.. కేటీఆర్ కు కొత్త పీసీసీ చీఫ్ కౌంటర్

by Prasad Jukanti |
T PCC:  ఉవ్విళ్ళూరుతున్న మీకు నిరాశ తప్పదు.. కేటీఆర్ కు కొత్త పీసీసీ చీఫ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని నూతన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అరికెపూడి గాంధీ టెక్నికల్‌గా బీఆర్ఎస్ సభ్యుడేనని, నిబంధనల ప్రకారమే ఆయన పీఏసీ చైర్మన్ అయ్యారని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఉప ఎన్నికలంటూ ఉవ్విళ్ళూరుతున్న కేటీఆర్‌కు నిరాశే మిగులుతుందన్నారు. కేటీఆర్ సవాళ్లను పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరని, మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహేశ్ వెల్లడించారు. ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ నేతలు లేరన్నారు. ఉప ఎన్నికలు రావని, ఒకవేళ వచ్చినా ఆ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు.

అప్పటివరకు పాత కమిటీలే..

ఢిల్లీకి వచ్చిన తాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లు మహేశ్ చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని ఖర్గే సూచించారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం, ఏఐసీసీ పెద్దలు మాట్లాడుతారని, ఈ విషయంలో వారే నిర్ణయం తీసుకుంటారన్నారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంతవరకు పాత కమిటీలు పని చేస్తాయని స్పష్టం చేశారు. తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మరోసారి ఢిల్లీకి వచ్చి కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతానన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎంఓ కమిటీ వేయబోతున్నారని, కమిటీ సూచనలను అధ్యయనం చేసి ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed